హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మైగ్రంట్స్ హెల్ప్‌ డెస్క్‌

- May 11, 2022 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మైగ్రంట్స్ హెల్ప్‌ డెస్క్‌

హైదరాబాద్: ఉపాధి కోసం విదేశాలకు...ముఖ్యంగా  గల్ఫ్,మలేసియా లాంటి 18 ఈసీఆర్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల కోసం హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రవాసి సహాయతా కేంద్రం (మైగ్రంట్స్ హెల్ప్‌ డెస్క్‌) ను ఈ రోజు ఉదయం ప్రారంభించారు. 

ఎయిర్‌పోర్టు నిర్వహిస్తోన్న జీఎంఆర్‌, తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (TOMCOM) లు సంయుక్తంగా ఈ హెల్ప్‌డెస్క్‌ని ఏర్పాటు చేశాయి. 

తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రాణి కుముదిని ఈ హెల్ప్‌ డెస్క్‌ను ప్రారంభించారు. టాంకాం అధికారి నాగభారతి, ఎన్నారై అధికారి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. 

అమెరికా వెళుతున్న విద్యార్థి బేతి యశ్వంత్ రెడ్డితో కలిసి వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి సాయంత్రం  విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ డిపార్చర్స్ వద్ద ఉన్న ఈ హెల్ప్ డెస్క్ ను సందర్శించారు.టాంకాం అధికారి నాగభారతి, హెల్ప్ డెస్క్ ఇంచార్జి ఫణి కుమార్ లను ఈ సందర్బంగా అభినందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com