దుబాయ్ డ్యూటీ ఫ్రీ: రెండు సార్లు జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు

- May 12, 2022 , by Maagulf
దుబాయ్ డ్యూటీ ఫ్రీ: రెండు సార్లు జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు

దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రా లో సునీల్ శ్రీధరన్ అనే భారత వ్యక్తి ఏకంగా 1 మిలియన్ డాలర్లు(రూ.6.50కోట్లు) గెలుచుకున్నాడు.అయితే, శ్రీధరన్‌ ఇలా వన్ మిలియన్ డాలర్లు గెలవడం ఇది రెండోసారి.ఇంతకు ముందు 2019లో తొలిసారి మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు.రెండేళ్ల వ్యవధిలోనే మనోడికి రెండుసార్లు జాక్‌పాట్ తగిలిందన్నమాట.కాగా, ఇప్పటివరకు ఇలా మిలీనియం మిలియనీర్ డ్రాలో రెండుసార్లు విజేతలుగా నిలిచిన వారిలో శ్రీధరన్ ఎనిమిదో వ్యక్తి అని ర్యాఫిల్ నిర్వాహకులు వెల్లడించారు.   

ఇక బుధవారం దుబాయ్ ఇంటర్నెషనల్ విమానాశ్రయంలో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో శ్రీధరన్ విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 10వ తేదీన అతడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన మిలీనియం మిలియనీర్ సిరీస్ 388, లాటరీ టికెట్ నం.1938 శ్రీధరన్‌కు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.దీంతో రాత్రికి రాత్రే అతడి బ్యాంక్ ఖాతాలోకి రూ.6.50కోట్లు వచ్చిపడ్డాయి.దుబాయ్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ బిజినెస్ చేసే 55 ఏళ్ల శ్రీధరన్ 20 ఏళ్ల నుంచి దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో పాల్గొంటున్నాడు.అప్పటి నుంచి క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటానని తెలిపాడు.ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. కాగా, 1999లో ప్రారంభమైన మిలీనియం మిలియనీర్‌లో 1మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారతీయుల్లో సునీల్ శ్రీధరన్ 188వ వ్యక్తి.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com