మాస్కుల పేరుతో కార్మికులను మోసం చేస్తున్న మోసగాళ్లు

- May 12, 2022 , by Maagulf
మాస్కుల పేరుతో కార్మికులను మోసం చేస్తున్న మోసగాళ్లు

బహ్రెయిన్: మనామాలోని పలు ప్రాంతాలలో మాస్కులు ధరించనందుకు మోసగాళ్ల బృందం కార్మికుల నుండి జరిమానాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మోసగాళ్లు తమను తాము సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) లేదా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిబ్బందిగా చెప్పుకుంటూ.. జరిమానా చెల్లించని పక్షంలో కార్మికులను కటకటాల వెనక్కి నెట్టివేస్తామని బెదిరిస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. భయంతో కార్మికులు BD5, BD10 మధ్య జరిమానాలు చెల్లిస్తున్నారు. అమాయక కార్మికులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలు జరుగుతున్నాయి. కోవిడ్ -19 నియమాలు, నిబంధనలలో మార్పుల గురించి వారికి ఎక్కువగా తెలియకపోవడంతో వారు సులభంగా మోసగాళ్ల ఉచ్చులో పడుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com