చొరబాటుదారులకు అనుమతిస్తే SR1 మిలియన్ జరిమానా, 15 ఏళ్ళ జైలు శిక్ష

- May 12, 2022 , by Maagulf
చొరబాటుదారులకు అనుమతిస్తే SR1 మిలియన్ జరిమానా, 15 ఏళ్ళ జైలు శిక్ష

రియాద్: చొరబాటుదారులు సౌదీ అరేబియాలోకి చొరబడటానికి అనుమతించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, అలాంటి వాటిని అరెస్టు చేయవలసిన ప్రధాన నేరాలలో ఒకటిగా పరిగణిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. చొరబాటుదారున్ని ఏ విధంగానైనా రాజ్యంలోకి అనుమతించే వ్యక్తిని అరెస్టు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. చొరబాటుదారులు రాజ్యంలోకి చొరబడటానికి వీలు కల్పించే వారికి SR1 మిలియన్ వరకు జరిమానా, అలాగే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయన్నారు. దీంతోపాటు చొరబాటుదారుడికి ఆశ్రయం కల్పించిన ఇంటిని కూడా జప్తు చేస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జరిమానాలు 7/27/1442 నాటి రాయల్ ఆర్డర్ నంబర్ A/406, 7/2/1443 నాటి రాయల్ ఆర్డర్ నంబర్ 7975 ప్రకారం విధించబడతాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com