జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లేహ్‌ హత్యను ఖండించిన ఖతార్

- May 12, 2022 , by Maagulf
జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లేహ్‌ హత్యను ఖండించిన ఖతార్

ఖతార్: అల్ జజీరా కరస్పాండెంట్ షిరీన్ అబు అక్లేహ్ (51) హత్యను ఖతార్ తీవ్రంగా ఖండించింది. బుధవారం షిరీన్ అబు అక్లేహ్ ఇజ్రాయిల్ దళాల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. షిరీన్ మరణంపై పారదర్శకమైన, స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఖతార్ పిలుపునిచ్చింది.  ఆ ప్రముఖ పాలస్తీనా-అమెరికన్ రిపోర్టర్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఘటనా స్థలంలో ఉన్న మరో పాలస్తీనా జర్నలిస్ట్ అలీ అల్-సముదీ గాయపడ్డాడు. ప్రపంచ నాయకులు, సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు, పత్రికా స్వేచ్ఛ సంఘాలు కూడా జర్నలిస్ట్ హత్యను తీవ్రంగా ఖండించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com