ఉత్తర కొరియాలో లాక్‌డౌన్
- May 12, 2022
సియోల్: ఉత్తర కొరియాలో మొదటిసారిగా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. కరోనా వెలుగుచూసిన రెండేళ్ల తర్వాత అక్కడ తొలి కేసు నమోదు కావడం గమనార్హం. అయితే, ఒక్క కేసు వెలుగు చూడగానే అప్రమత్తమైన ఉత్తర కొరియా వెంటనే సరిహద్దులు మూసేసి లాక్‌డౌన్ విధించారు. దేశాధినేత కిమ్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కరోనా కట్టడి చేసే చర్యలు చేపట్టారు.
రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జ్వరంతో బాధపడుతున్న వారికి ఆదివారం కరోనా పరీక్షల్లో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కిమ్ అధికార కొరియన్ వర్కర్స్ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు పై చర్చించారు. వైరస్‌ను అదుపు చేసే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. తక్కువ వ్యవధిలోనే కరోనా మూలాలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







