దుబాయ్ లో శివసేన ఎమ్మెల్యే హఠాన్మరణం..
- May 12, 2022
దుబాయ్: దుబాయ్ కు వచ్చిన శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణించారు.కుటుంబంతో కలిసి దుబాయ్ వచ్చిన ఎమ్మెల్యే రమేశ్ లట్కే బుధవారం గుండెపోటుతో మరణించారని శివసేన ఆఫీస్ బేరర్ తెలిపారు.ముంబైలోని అంధేరి ఈస్ట్ నియోజకవర్గం నుంచి రమేశ్ లట్కే రెండుసార్లు శివసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
2014లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్టిని ఓడించి..తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు లట్కే. 2019లో స్వతంత్ర అభ్యర్థి ఎం.పటేల్ పై ఘనవిజయం సాధించారు. అంతకుముందు బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్‌కు(BMC) కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు.ఎమ్మెల్యే మృతి వార్త తెలిసి పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు.ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.రమేశ్ లట్కే మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని,ఇటీవల కొంకణలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా విమానంలో కలిశారని బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







