వెంకటేష్ ‘విక్టరీ’: ఈ సారేం జరుగుతుందో.!
- May 12, 2022
విక్టరీ వెంకటేష్ మామూలోడు కాదు. కరోనా ప్యాండమిక్ టైమ్‌లో ఒకటి కాదు, ఏకంగా రెండు సినిమాలతో హిట్టు కొట్టేశాడు. అదీ ఓటీటీ రిలీజులతో. ‘దృశ్యం 2’, ‘నారప్ప’ సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజై మంచి విజయాలనిపించుకున్నాయ్.
ఎలాంటి నెగిటివ్ టాక్‌నీ మూట కట్టుకోలేదీ రెండు సినిమాలు. ఇక ఇప్పుడు వెంకటేష్ నుంచి ‘ఎఫ్ 3’ సినిమా రాబోతోంది. అస్సలు అనుమానాలే లేవ్ ‘ఎఫ్ 3’ హిట్టు బొమ్మ. డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ వుంది. ఇంతవరకూ ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు.
అలాగే వెంకటేష్ విషయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారు ఈ సినిమాకి. ఫుల్ టైమ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. సో, హాట్ సమ్మర్‌లో కూల్ మూవీగా కొట్టుకుపోతుందనడం అతిశయోక్తి కాదేమో.
మరోవైపు ఈ మధ్య రిలీజైన సినిమాలకు నెగిటివ్ టాక్ పెద్ద తంటాగా మారింది. అందుకు టిక్కెట్ట్లు రేట్ల పెంపు ఓ కారణమనే వాదన కూడా వుంది. సో, ఆ విషయంలోనూ ‘ఎఫ్ 3’ మినహాయింపు కానుందని తెలుస్తోంది. టిక్కెట్టు రేట్ల పెంపు దిశగా ఎలాంటి ఆలోచనలూ చేయకూడదని ‘ఎఫ్ 3’ టీమ్ స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యిందట. సో, ఈ లెక్కలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, ‘ఎఫ్ 3’ హిట్టు పక్కా అని ట్రేడ్ పండితుల అంచనా వేసేస్తున్నారు.
ఈ నెల 27న ‘ఎఫ్ 3’ ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్టరీ వెంకటేష్‌తో పాటు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, క్యూట్ క్యూట్ మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







