బర్త్‌డే స్పెషల్: సన్నీలియోన్ అందుకే అంత ఇన్సిప్రేషన్.!
- May 13, 2022పోర్న్ స్టార్‌గా పరిచయమై, బాలీవుడ్లో హీరోయిన్గా, ఐటెం గాళ్‌గా సక్సెస్ అయిన ముద్దుగుమ్మ సన్నీలియోని. సన్నీలియోని.. ఆ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టేస్తుంటుంది. అదో రకమైన వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్ కారణంగానే సోషల్ మీడియాలోనూ సన్నీలియోన్ ఓ సెన్సేషన్.
బాలీవుడ్లోనే కాదు, సన్నీ ప్రకంపనలు ఇటు సౌత్ సినిమాకీ పాకాయ్. కొన్ని నిముషాల పాటు సన్నీలియోన్ సినిమాలో కనిపించిందంటే చాలు.. ఆ సినిమాకి బోలెడంత క్రేజ్. ఆ క్రేజ్‌కి తగ్గట్లుగానే ఆమె రెమ్యునరేషన్ కూడా వుంటుందనుకోండి.
సన్నీ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనే కొన్ని సౌత్ సినిమాలు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తమ సినిమాలకు సరికొత్త గ్లామర్ హొయలు అద్దుతుంటారు. గతంలో మంచు మనోజ్ నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన సన్నీలియోన్, ఇప్పుడు మళ్లీ మంచు వారబ్బాయ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించేందుకు టాలీవుడ్‌కి వచ్చింది.
మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న సినిమాలో సన్నీలియోన్ నటిస్తోంది. ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ సన్నీలియోన్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు మరి. ఇక సినిమాల సంగతి అటుంచితే, సన్నీలియోన్ పర్సనల్ లైఫ్ కూడా ఆదర్శవంతమైనదే. ఓ ఆడపిల్లను దత్తత తీసుకుని పెంచుకుంది.
అలాగే సరోగసీ ద్వారా ఇద్దరు మగ పిల్లలకు తల్లి కూడా అయ్యింది. కమర్షియల్‌గా రకరకాల బిజినెస్‌లతో పాటు, అప్పుడప్పుడూ కొన్ని సేవా కార్యక్రమాల్లోనూ సన్నీలియోన్ చురుగ్గా పాల్గొంటుంది. అందుకే హీరోయిన్గా, ఐటెం గాళ్‌గా ముగ్గురు బిడ్డలకు తల్లిగా సన్నీలియోన్ జీవితం చాలా చాలా ఆదర్శవంతం. ఈ రోజు బర్త్‌డే జరుపుకుంటున్నహాట్ హాట్ సన్నీలియోన్‌కి బర్త్ డే విషెస్ చెప్పేద్దామా.. హ్యాపీ బర్త్‌డే టు సన్నీలియోన్.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు