అప్పుడు ట్రెండింగ్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ పున్ను ఇప్పుడేం చేస్తోందో తెలుసా.?
- May 13, 2022
పునర్నవి భూపాలం. అప్పట్లో బుల్లితెరపై ఈ పేరు ఓ సంచలనం. ఎందుకంటే, బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్ వన్ ఆఫ్ ది సీజన్స్‌లో ఈ ముద్దుగుమ్మఓ హాటెస్ట్ కంటెస్టెంట్ అన్నమాట. అంతకన్నా ముందే ‘ఉయ్యాలా జంపాలా’ అనే సినిమాలో నటించినప్పటికీ, బిగ్‌బాస్ షోతోనే ట్రెండింగ్ అయ్యింది. ముఖ్యంగా ఆ సీజన్‌కి సంబంధించి సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్.
ఇంకేముంది.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చాకా లేదు, లేదు బిగ్‌బాస్ హౌస్‌లోనే వీరిద్దరికీ పెళ్లి చేసేస్తారట.. అనేంతలా అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ ప్రచారమే అప్పటి బిగ్‌బాస్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయ్యేలా చేసింది. అయితే, అది జరిగిందా.? నో ఛాన్స్.. !
హౌస్ నుంచి బయటికి వచ్చాకా కూడా కొన్నాళ్లు ఇదే ప్రచారానికి కాస్త అటూ ఇటూ మసాలా అద్దుతూ వచ్చారు కానీ, ఆ తర్వాత ఆ మసాలా ఘాటు తగ్గిపోయింది. ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అంతేనా.. బిగ్‌బాస్ షోతో పునర్నవి దక్కించుకున్న పాపులారిటీకి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్కా అని కూడా ప్రచారం చేసేశారు.
కానీ, అదీ జరగలేదు. ఇటు సినిమాలూ లేవు. అటు ప్రేమ, పెళ్లి ముచ్చటా లేదు. పాప చక్కగా విదేశాలకు చెక్కేసింది. పై చదువుల పేరు చెప్పి, విదేశాల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. అక్కడి నుంచే అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలూ, వీడియోలూ షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో పున్ను బేబీకి ఫాలోయింగ్ చాలా ఎక్కువ కదా.. అదేనండీ బిగ్‌బాస్‌తో వచ్చిన ఫేమ్. సో, పాప ఫోటోలు ఎప్పటికప్పుడే హాట్ హాట్‌గా వైరల్ అయిపోతుంటాయ్ మరి.
ఇక ఇప్పుడు సినిమాల కోసం అడిగితే, చదువు పూర్తి చేసుకున్నాకా, సినిమాలపై ఫోకస్ పెడతానని చెబుతోంది. పెళ్లి ముచ్చట అయితే ఇంకా అప్పుడే కాదని ఎస్కేప్ అయిపోయింది అందాల పునర్నవి. అదీ సంగతి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







