యూఏఈ అధ్యక్షుడి మృతికి ప్రధాని మోదీ సంతాపం
- May 14, 2022
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకస్మిక మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. "హెచ్‌హెచ్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ మరణించిన విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను" అని ప్రధాన మంత్రి తన ట్విట్టర్ పోస్ట్ లో పేర్కొన్నారు. దివంగత యూఏఈ ప్రెసిడెంట్ "గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు, అతని ఆధ్వర్యంలో భారతదేశం-యూఏఈ సంబంధాలు అభివృద్ధి చెందాయి" అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో భారతీయ సమాజం యూఏఈ ప్రజలతో ఉన్నారని పేర్కొంటూ ప్రధాని మోదీ తన సంతాపాన్ని పంపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని మోదీ ప్రార్థించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్ కూడా యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణంపై తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 73 సంవత్సరాల వయస్సులో మరణించారు. షేక్ అల్ నహ్యాన్ నవంబర్ 2004 నుండి యూఏఈ అధ్యక్షుడిగా, అబుదాబి పాలకుడిగా పనిచేశారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







