బహ్రెయిన్‌లో 23-అడుగుల పొడవైన సెయిల్‌డ్రోన్ నౌక

- May 14, 2022 , by Maagulf
బహ్రెయిన్‌లో 23-అడుగుల పొడవైన సెయిల్‌డ్రోన్ నౌక

బహ్రెయిన్‌: 15 అడుగుల పొడవైన షార్క్ ఫిన్‌తో టార్పెడోను పోలి ఉండే రోబోటిక్, 23 అడుగుల పొడవైన నౌక సెయిల్‌డ్రోన్ బహ్రెయిన్‌ సముద్ర జలాల్లో సందడి చేసింది. ఈ మానవరహిత ఓడలు నౌకాదళానికి మధ్యప్రాచ్యంలో రద్దీగా ఉండే జలాల్లో పెట్రోలింగ్ చేయడంలో సహాయపడతాయి. ఇవి సముద్రపు దొంగలు, స్మగ్లర్లు, మిలీషియాల జాడను తెలుసుకునేందుకు తోడ్పడతాయి. యూఎస్ నేవీ స్టార్స్ అండ్ స్ట్రైప్స్ వీటి విస్తరణపై నివేదికలు తయారు చేసింది. గాలి, సౌర ఫలకాలతో దీన్ని నిర్మించారు. ఇందులో కెమెరాలు, సెన్సార్‌లను అమర్చారు. గుర్తించిన వాటిని తెలుసుకునేందుకు డేటాను విశ్లేషించేలా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com