యూఏఈ విచ్చేయనున్న భారత ఉపరాష్ట్రపతి
- May 14, 2022
యూఏఈ: షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతిపై యూఏఈ నాయకులకు సంతాపం తెలియజేసేందుకు భారత ప్రభుత్వం తరపున మే 15న యూఏఈ విచ్చేయనున్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
ఉపరాష్ట్రపతి పర్యటనను ధృవీకరిస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేడు ప్రకటన విడుదల చేసింది.
శనివారం అనగా మే 14న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ న్యూఢిల్లీలోని యూఏఈ ఎంబసీని సందర్శించి భారత తరపున సంతాపాన్ని తెలియజేశారు. షేక్ ఖలీఫా మృతికి సంతాప సూచికంగా భారత్ కూడా మే 14న జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.
ఇక, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హయాంలో భారత్-యూఏఈ సంబంధాలు బాగా వృద్ధి చెందాయని మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







