పీఏసీఐ సివిల్ ఐడీ పునరుద్ధరణ ప్రక్రియ సులభతరం
- May 15, 2022
కువైట్: పౌరులు, నివాసితులకు అందించే డిజిటల్ సేవలను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) సరళీకృతం చేసింది. ఏకీకృత ప్రభుత్వ దరఖాస్తుకు కొత్త అప్డేట్ ద్వారా కుటుంబ సభ్యుల కోసం పౌర ఐడీలను పునరుద్ధరించడాన్ని సులభతరం చేసింది. ఎలక్ట్రానిక్ సేవలు (సాహెల్) అధికారిక ప్రతినిధి యూసఫ్ కజెమ్ సహెల్ మాట్లాడుతూ.. అప్లికేషన్ ద్వారా పీఏసీఐ సేవలను మరింత వేగంగా, సరళంగా పొందవచ్చాన్నారు. దీంతో కుటుంబ సభ్యుల కోసం సివిల్ ఐడి పునరుద్ధరణ సేవను ఉపయోగించడం ఇప్పుడు సాధ్యమవుతుందని వివరించారు. కుటుంబ పెద్ద ఇప్పుడు తన పిల్లల సివిల్ ఐడీ కార్డులను పునరుద్ధరించవచ్చని, కంపెనీ స్పాన్సర్లు సాహెల్ అప్లికేషన్ ద్వారా నేరుగా తమ ఉద్యోగుల కార్డులను పునరుద్ధరించుకోవచ్చని ఆయన తెలిపారు. సహేల్ అప్లికేషన్లోని (సేవలు) మెనుని ఎంచుకుని, ఆపై పీఏసీఐ సేవలను ఎంచుకుని, ఆపై 'కార్డ్ సేవలు' ఆపై 'కార్డ్ పునరుద్ధరణ సేవ'ను ఎంచుకుని, ఆపై ఇన్పుట్ వివరాలు ఇవ్వడం ద్వారా వినియోగదారులు కార్డులను పునరుద్ధరించుకోవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







