శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు: ప్రధాని విక్రమ్ సింఘే
- May 17, 2022
శ్రీలంక పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఆ దేశంలో ఒక్క రోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు ఉన్నాయి. డీజిల్ కొరత కూడా వేధిస్తున్నా..
కొన్ని రోజులకు సరిపోనుంది. ఈ విషయాన్ని అక్కడి నూతన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే నిర్మొహమాటంగా చెప్పేశారు. ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితుల ముందు నిలబడిందన్నారు. దేశాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చే పనే తన ప్రథమ కర్తవ్యమని ప్రకటించారు. ఇక శ్రీలంక ఎయిర్ లైన్స్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతమున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ప్రత్యామ్నాయంగా తాము కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెడతామని వెల్లడించారు. 2019 లో విదేశీ మారకంలో 7.5 బిలియన్ డాలర్ల నిధులుండేవని, ఇప్పుడు ఖజానాలో ఒక్క మిలియన్ డాలర్లు కూడా లేని అధ్వాన్న స్థితిలో ఉండిపోయామని అన్నారు.
గ్యాస్ దిగుమతి చేసుకోవాలంటేనే 5 మిలియన్ డాలర్లు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం 3,200 బిలియన్ల అప్పు తీసుకోవడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, వీటిలో మే రెండో వారం నాటికి 1950 బిలియన్లు ఖర్చు అయినట్లు పేర్కొన్నారు. దీంతో 1250 బిలియన్లు మాత్రం మిగిలాయని తెలిపారు.

కనుక ఈ అప్పుల పరిమితిని 3 వేల బిలియన్ల నుంచి 4 వేల బిలియన్ల వరకు పెంచడానికి పార్లమెంట్ ముందు ఓ ప్రతిపాదన పెడుతున్నట్లు విక్రమ సింఘే పేర్కొన్నారు. చమురు ద్వారానే అధికంగా కరెంట్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. అందుకే 15 గంటల వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ప్రకటించారు. అయితే విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు నిధుల సమీకరణ జరుగుతోందని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







