కాఫీ తాగితే రిలాక్స్ అయిపోతానంటోన్న ‘మెంటల్’ భామ.!
- May 17, 2022
‘వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ’ అంటూ ఓ సినిమాలో హీరోయిన్ చెప్పే డైలాగ్ వుంటుంది. ఎంత కోపంలో వున్నా సరే, హీరో ఈ మాటలకు కూల్ అయిపోతుంటాడు. ఆ మాటకొస్తే, ఎవరైనా సరే, కాఫీ ఇస్తే కూల్ అయిపోతుంటారనుకోండి. ఎన్ని టెన్షన్స్ వున్నా, హాయిగా కూర్చొని ఓ కప్పు కాఫీ లాగిస్తే చాలు ఆ టెన్షన్స్ నుంచి రిలాక్స్ మూడ్‌లోకి వచ్చేశామన్న ఫీల్ వుంటుంది. కాఫీలో వున్న మ్యాజిక్ అది.
ఇప్పుడీ కాఫీ ముచ్చట ఎందుకంటారా.? మన హీరోయిన్ కూడా అంతే, ఎన్ని టెన్షన్స్ వున్నా సరే, కప్పు కాఫీ తాగితే చాలు రిలాక్స్ మూడ్‌లోకి వచ్చేస్తుందట. ఇంతకీ ఎవరా హీరోయిన్.? ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్.
హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ అందుకోలేదు కానీ, నివేదా పేతురాజ్‌లో సమ్‌థింగ్ డిఫరెంట్ మ్యాజిక్ వుంది. నటిగా ఎలాంటి రోల్ అయినా క్యారీ చేయగల టాలెంట్ వుంది ఈ భామలో. స్టార్ స్టేటస్‌తో తనకు పని లేదంటోంది అందుకే నివేదా పేతురాజ్. నటిగా మంచి పాత్రలు దక్కించుకోవడమే తన మోటో అని చెబుతోంది.
రీసెంట్‌గా నివేదా పేతురాజ్ నటించిన ‘బ్లడీ మేరీ’ ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి ఆదరణ దక్కించుకుంది. చిన్న సినిమానే అయినా పెద్ద ప్రశంసలు దక్కించుకుంది. నివేదా పేతురాజ్ నటనే ఈ సినిమాకి మెయిన్ అస్సెట్. త్వరలో ‘విరాట పర్వం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది నివేదా పేతురాజ్.
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా రూపొందుతోన్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ ఓ స్టన్నింగ్ రోల్ పోషిస్తోంది. వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకుడు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







