వెరీ టఫ్ టాస్క్: ప్రబాస్ ఎలా మ్యానేజ్ చేస్తున్నాడబ్బా.!
- May 17, 2022
‘బాహుబలి’ సినిమాతో తిరుగులేని స్టార్‌డమ్ దక్కించుకున్నాడు ప్రబాస్. పాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతున్నాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ నుంచి వస్తున్న సినిమాలు కూడా అదే స్థాయిలో రూపొందుతోన్నసంగతి తెలిసిందే.
ఆ నేపథ్యంలో ప్రస్తుతం ప్రబాస్ చేతిలో చాలా చాలా ప్రాజెక్టులున్నాయ్. అన్నీ బిగ్ ప్రాజెక్టులే. అలాగే డిఫరెంట్ కథా, కథాంశాలతో రూపొందుతోన్న సినిమాలివి. అంతా బాగానే వుంది. కానీ, కథను బట్టి, కథనాన్ని బట్టి హీరోలు తమ ఫిజిక్‌ని కూడా కాస్త అటూ ఇటూ మార్పులు చేసుకోవల్సి వుంటుంది. అందుకే హీరోలు ఒక సినిమా పూర్తి చేశాకే మరో సినిమాని పట్టాలెక్కిస్తుంటారు మేకోవర్ కోసం.
కానీ, ప్రబాస్ మాత్రం అస్సలు టైమ్ తీసుకోవడం లేదు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు ప్రబాస్‌కి ఆశించిన రిజల్ట్ అందించకపోవడంతో, వీలైనంత త్వరగా సినిమాలు చేయాలని ప్లాన్ చేశాడు. ఆ దిశగా అరడజనుకు పైగా సినిమాలు ఓకే చేసి పెట్టాడు. వాటిలో కొన్ని పట్టాలెక్కించేశాడు కూడా.
అలా ప్రస్తుతం సెట్స్‌పై వున్న సినిమాల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకుడు. దాదాపు సగం వరకూ ఈ సినిమా షూటింగ్ జరిగిపోయింది. అలాగే, ఇంకో సినిమా ‘ప్రాజెక్ట్ కె’. ఇది కూడా షూటింగ్‌లోనే వుంది. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోంది ఈ సినిమా. మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో ప్రబాస్ ‘ఆదిపురుష్’ చిత్రంలో నటిస్తున్నాడు.
అందరికీ అర్ధం కాని విషయమేంటంటే, ఒకదానికి ఒకటి సంబంధం లేని కథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలను ఒకేసారి ప్రబాస్ ఎలా పూర్తి చేస్తున్నాడు.? మేకోవర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.? స్ర్కీన్‌పై ఆయా క్యారెక్టర్స్ వేరియేషన్స్‌ని ప్రబాస్ ఎలా మ్యానేజ్ చేస్తున్నాడు.? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. కానీ, అక్కడున్నది బాహుబలి. ఆయనకేదైనా సాధ్యమే సుమీ.
తాజా వార్తలు
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!







