పీయూష్‌ గోయల్‌కు కేటీఆర్ విన్నపం..ఎందరికో ఉపాధి లభించే అవకాశం అంటూ ట్వీట్

- May 17, 2022 , by Maagulf
పీయూష్‌ గోయల్‌కు కేటీఆర్ విన్నపం..ఎందరికో ఉపాధి లభించే అవకాశం అంటూ ట్వీట్

తెలంగాణ మంత్రి కేటీఆర్..కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు ట్విట్టర్ ద్వారా విన్నపం తెలిపారు. ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ ను సమీక్షించి, దాన్ని పునరుద్ధరించాలని ట్విట్టర్ ద్వారా పియూష్ ను కోరారు. దీనికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. యూనిట్ పునరుద్ధరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహకారం అందిస్తామని.. ఈ యూనిట్ పునరుద్ధరింపబడితే… ఆదిలాబాద్ కు చెందిన వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.
 
అలాగే యూనిట్ కు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన ట్వీట్ ను, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను షేర్ చేశారు. ‘ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను పునరుద్ధరించాలని, జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా పోరాడుతుంటే.. మరోవైపు పరిశ్రమ తొలగింపునకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది’ అంటూ జోగు రామన్న ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com