కొకైన్ స్మగుల్ చేస్తున్న ప్రయాణీకుడి అరెస్ట్

- May 17, 2022 , by Maagulf
కొకైన్ స్మగుల్ చేస్తున్న ప్రయాణీకుడి అరెస్ట్

దుబాయ్: కడుపులో కొకైన్ దాచి స్మగుల్ చేసేందుకు యత్నించిన 43 ఏళ్ళ ప్రయాణీకుడ్ని అరెస్ట్ చేశారు. దుబాయ్ ఎయిర్ పోర్ట్ చెక్ పాయింట్ వద్ద నిందితుడు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అనుమానిత వస్తువులేమైనా తీసుకెళుతున్నాడేమోనని కస్టమ్స్ అధికారులు ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని అతను సమాధానమిచ్చాడు. అయితే, అనుమానంతో అతన్ని పరీక్షించగా, అతని కడుపులో కొకైన్ క్యాప్సూల్స్ వున్నట్లు తేలింది. 1,000 డాలర్ల కోసం తాను ఈ పని చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. నిందితుడ్ని జనరల్ డిపార్టుమెంట్ ఫర్ డ్రగ్ కంట్రోల్‌కి అప్పగించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com