దుబాయ్ లో ఇంటర్సిటీ బస్సు సర్వీసుల పునరుద్ధరణ
- May 18, 2022
దుబాయ్: కోవిడ్-19 సంఖ్యలు తగ్గడంతో పరిమితులు సడలించారు. దీంతో ఎక్కువ మంది ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించడం మొదలుపెట్టారు. డిమాండ్‌ను తీర్చడానికి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA) మే 19 నుండి 4 ఇంటర్సిటీ బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తోంది. దుబాయ్ నుండి పునఃప్రారంభించబడే నాలుగు ఇంటర్సిటీ బస్సు మార్గాలు.. అల్ ఘుబైబా బస్ స్టేషన్ నుండి అబుదాబికి E100, అల్ ఘుబైబా బస్ స్టేషన్ నుండి అల్ ఐన్ వరకు E201, ఎటిసలాట్(Etisalat) మెట్రో స్టేషన్ నుండి మువైలేహ్, షార్జా వరకు E315, ఎతిహద్ (Etihad) బస్ స్టేషన్ నుండి ఫుజరహ్(Fujarah) E700 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. మే 19న జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్ మెట్రో స్టేషన్ నుండి మరో కొత్త మార్గం ప్రారంభించబడుతుంది. F38 అని పిలువబడే ఈ మార్గం మెట్రో లింక్, దుబాయ్ స్పోర్ట్స్ సిటీ వరకు అనేక జిల్లాల గుండా వెళుతుందని ట్రాన్స్ పోర్ట్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







