లండన్ చేరుకున్న మంత్రి కే తారకరామారావు
- May 18, 2022
లండన్: యునైటెడ్ కింగ్డమ్ మరియు దావోస్ పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి లండన్ చేరుకున్న మంత్రి కే తారకరామారావు కి ఘన స్వాగతం లభించింది. లండన్ విమానాశ్రయం లో యూకే కి చెందిన టిఆర్ఎస్ పార్టీ విభాగంతో పాటు అనేక ఎన్ఆర్ఐ సంఘాలు, పలువురు మంత్రి కేటీఆర్ కి స్వాగతం పలికారు. యూకేలో 4నాలుగు రోజులపాటు పర్యటనకు విచ్చేసిన మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది మందితో లండన్ విమానాశ్రయంలో కోలాహలం నెలకొంది. అనేక మంది తమ కుటుంబ సభ్యులతో సైతం విమానాశ్రయానికి చేరుకుని కేటీఆర్ కి పూల గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ తో ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. మంత్రి కేటీఆర్ బుధవారం నుంచి అనేక రంగాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మంత్రి కేటీఆర్ కి లండన్ లో స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







