ప్రేమలో పడ్డ ఐటెం బాంబ్: ఆ ముద్దుగుమ్మల బాటలోనే.!

- May 18, 2022 , by Maagulf
ప్రేమలో పడ్డ ఐటెం బాంబ్: ఆ ముద్దుగుమ్మల బాటలోనే.!

బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ ప్రేమలో పడిందట. అదేంటీ. ఈ ముద్దుగుమ్మకి ఆల్రెడీ పెళ్లయిపోయిందేమో కదా.. అని కాస్త అటూ ఇటూ డౌటు కొడుతుందా.? అవునండీ రాఖీ సావంత్‌కి పెళ్లయ్యింది. కానీ, తన భర్తకు అంతకు ముందే పెళ్లయ్యి భార్య, కొడుకు వున్నాడన్న ఆరోపణతో విడాకులు తీసుకుంది ఈ అమ్మడు.

అంతేకాదు, ఆ మధ్య పలుసార్లు తన భర్త తనను వేధిస్తున్నాడనీ, శారీరకంగా చిత్ర హింసలకు గురి చేస్తున్నాడంటూ పోలీసులనాశ్రయించింది కూడా. అయినా, రాఖీ సావంత్‌కి దూకుడు చాలా ఎక్కువ. నోరు అస్సలు మంచిది కాదు. ఆ నోటితో చాలా సార్లు కాంట్రవర్సీల్లో ఇరుక్కున్న సంగతి చాలా మందికి తెలిసే వుంటుంది.

అది సరే, ఇప్పుడీ ఐటెం బ్యూటీ మళ్లీ ప్రేమలో పడిందట. అది కూడా వయసులో తనకన్నా ఆరేళ్ల చిన్నోడితో ప్రేమలో పడిందట. అబ్బో.! ఈ తరహా ప్రేమ కథలు చాలానే విన్నాం కదా అనుకుంటున్నారా.? అవునవును.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చో్ప్రా.. మరో బాలీవుడ్ హాట్ సెన్సేషన్ మలైకా అరోరా కూడా ఈ తరహా ప్రేమ కథలతోనే పాపులర్ అయ్యారు.

తన నోటి దూలతో కాస్తో కూస్తో పాపులారిటీ దక్కించుకున్నా, అది చాలదనుకుంటోందేమో రాఖీ సావంత్. ఇప్పుడిదిగో ఈ ముదురు, లేత ప్రేమ కహానీలతో పబ్లిసిటీ స్టంట్లు చేసుకుంటోంది. ఇంతకీ రాఖీ సావంత్ లేత ప్రేమికుడు సినిమాలకు సంబంధించిన వాడేనా.? అంటే కాదులెండి. ఓ బిజినెస్ పర్సన్. పేరు అదిల్ దురానీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com