బహ్రెయిన్ లో ప్రారంభమైన 13వ గల్ఫ్ ఫోరమ్
- May 19, 2022
బహ్రెయిన్ : 13వ గల్ఫ్ ఫోరమ్ ను బహ్రెయిన్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ బిన్ ముహమ్మద్ అలీ హుమైదాన్ ప్రారంభించారు. “ఇన్స్టిట్యూషనల్ నెట్వర్కింగ్ ఈజ్ ఏ నెససిటీ ఫర్ సోషల్ ప్రొఫెషన్స్” పేరుతో 13వ గల్ఫ్ ఫోరమ్ ఫర్ సోషల్ సొసైటీస్ అండ్ అసోసియేషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఇది జీసీసీ దేశాల మధ్య సామాజిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిర్వాహకులు ప్రకటించారు. రెండు రోజుల ఫోరమ్ లో భాగంగా నెట్వర్కింగ్ భావన, మెకానిజమ్స్, ప్రాథమిక అవసరాలను పరిచయం చేయడం, సామాజిక రంగంలో పనిచేస్తున్న అరబ్- అంతర్జాతీయ సంస్థాగత నెట్వర్క్ ల అనుభవాలను సమీక్షించనున్నారు. అలాగే ఎన్జీఓ(NGO)ల మధ్య సహకారం, నాలెడ్జ్ షేరింగ్, సంస్థల కోసం నెట్వర్క్ లను నిర్మించే దశలు, వాటి పని విధానాలు, అధికారిక సంస్థలు-ఎన్జీఓలలో సామాజిక వ్యవహారాలపై ఆసక్తి, సంస్థాగత నెట్వర్కింగ్ నెట్వర్క్ లను స్థాపించే అంశాలను ఈ ఫోరమ్ హైలైట్ చేయనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్







