అబుధాబి బిగ్ టికెట్: ఇద్దరు భారతీయ మిత్రులకు జాక్‌పాట్..
- May 19, 2022
అబుధాబి: అబుధాబిలో ఇద్దరు భారత ప్రవాసులకు అబుధాబి బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో జాక్‌పాట్ తలిగింది.బుధవారం నిర్వహించిన బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో భారత్ కు చెందిన డియోన అన్నా బిను, షరీఫ్ పనిచాయిల్ ఏకంగా 500,000 దిర్హాములు గెలుచుకున్నారు.ఇటీవల ఈ ఇద్దరు మిత్రులు కలిసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం.069002కు ఈ జాక్‌పాట్ తగిలింది. వారిద్దరూ గడిచిన రెండేళ్ల నుంచి క్రమం తప్పకుండా బిగ్ టికెట్ రాఫెల్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
పనిచాయిల్ అబుధాబిలోని ముస్సాఫాలో చిన్న కూరగాయల మార్కెట్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.అయితే, తాను గెలిచిన భారీ నగదులో కొంత భాగం తన కూరగాయల బిజినెస్‌ను విస్తరించడంలో వినియోగిస్తానని తెలిపాడు. మరో విజేత బిను మాట్లాడుతూ చాలా రోజులుగా మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నాడు. ఇలాంటి సమయంలో తనకు భారీ మొత్తం చేతికి వస్తుండడం ఆనందంగా ఉందన్నాడు. తాను కూడా అబుధాబిలో కూరగాయల వ్యాపారం మొదలు పెడతానని చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్







