చెల్లి పెళ్లి.. అక్క డెలివరీ: గల్రాని సిస్టర్స్ డబుల్ ధమాకా.!

- May 20, 2022 , by Maagulf
చెల్లి పెళ్లి.. అక్క డెలివరీ: గల్రాని సిస్టర్స్ డబుల్ ధమాకా.!

సంజనా గల్రాని.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. చేసిన సినిమాలు తక్కువే కానీ, ఫేమ్ బాగానే సంపాదించుకుందీ కన్నడ కుట్టి. ప్రబాస్ హీరోగా వచ్చిన ‘బుజ్జిగాడు’ సినిమాలో త్రిషకి చెల్లెలిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.

 తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత అడపా దడపా అవకాశాలతో మాత్రమే సరిపెట్టుకుందనుకోండి. సినిమాలతో కన్నా, సోషల్ మీడియాలో సంజనాకి ఫాలోయింగ్ ఎక్కువ. ఈ మధ్య డ్రగ్స్ కేసులో చిక్కుని అరెస్టయ్యి మరింత పాపులర్ అయ్యింది.
 
కాగా, ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి రియల్ లైఫ్‌లో అమ్మ అనుభూతిని ఆస్వాదిస్తోంది మరి. కరోనా పాండమిక్ టైమ్‌లో సంజనా వివాహం జరిగింది. ఆ వెంటనే ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. తాజాగా బెంగుళూరు ఆసుపత్రిలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు అధికారికంగా సోషల్ మీడియాలో తెలిపింది.

మరోవైపు సంజనా చెల్లెలు నిక్కీ గల్రాని తాజాగా హీరో కమ్ విలన్ ఆది పినిశెట్టిని పెళ్లి చేసుకుని ఓ ఇంటిది అయ్యింది. కో ఇన్సిడెంటల్‌గా జరిగాయో ఏమో ఈ ఇద్దరు అక్క చెల్లెళ్లు తమ రియల్ లైఫ్‌లో ఒకేసారి ప్రమోట్ అయ్యారు. ఒకరు తల్లిగా ఇంకొకరు భార్యగా.
 
భలే వుంది కదా.. గల్రాని సిస్టర్స్ ఇంట డబుల్ ధమాకా. ఈ రెండు గుడ్ న్యూస్‌తో గల్రాని ఇంట సంతోషాల నవ్వులు చిందులేస్తున్నాయి. మరో పక్క సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరు సిస్టర్స్‌కి విషెస్ పోటెత్తుతున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com