‘F3’ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్దే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.?
- May 20, 2022
స్టార్ హీరోయిన్ ఛైర్‌కి ఎలాంటి ఢోకా లేకుండా కెరీర్ బిల్డప్ చేసుకుంటోంది ముద్దుగుమ్మ పూజా హెగ్దే. బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షకుల్లో అపారమైన అభిమానం సంపాదించుకుంది అందాల భామ పూజా హెగ్దే. ఓ పక్క హీరోయిన్‌గానూ మరో పక్క స్పెషల్ సాంగ్స్‌తోనూ పూజా హెగ్దే దూసుకెళ్లిపోతోంది.
హీరోయిన్‌గా ఆమెకున్న క్రేజ్‌ని స్పెషల్ సాంగ్స్ కోసం కూడా బాగా వాడుకుంటున్నారు మన తెలుగు మేకర్లు. గతంలో ‘రంగస్థలం’ సినిమా కోసం జిగేల్ రాణిగా ధడ ధడలాడించింది పూజా హెగ్దే. సినిమాతో పాటు, ఆ పాట కూడా సెన్సేషనల్ హిట్ అందుకుంది.
ఇక తాజాగా మరోసారి పూజా తన ‘స్పెషల్’ మ్యాజిక్‌ని రిపీట్ చేయబోతోంది ‘ఎప్ 3’ సినిమా ద్వారా. ‘అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా వుండాలా..’ అంటూ స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్దే చిందులు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి.
అయితే, ఈ సాంగ్‌లో బుట్టబొమ్మ అంతలా హోయలొలికించేందుకు అక్షరాలా 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందట. పూజా హెగ్దే ‘స్పెషల్’ రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ర్టీ హాట్ టాపిక్ అయ్యింది.
హీరోయిన్లుగా నటిస్తున్న తమన్నా, మెహ్రీన్ కౌర్ కన్నా ఈ మొత్తం ఎక్కువ అని మాట్లాడుకుంటున్నారు. అవును మరి, పూజా హెగ్దేనా.? మజాకానా.? స్పెషల్ సాంగ్‌లో చిందేయాలంటే, మినిమమ్ రెమ్యునరేషన్ అట్టా వుండాలా.!
ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ‘ఎఫ్ 3’ హిట్టు బొమ్మ. ఈ హిట్టు బొమ్మకి బుట్ట బొమ్మ స్పెషల్ సాంగ్ మరో మెయిన్ అస్సెట్ అవుతుందనడం అతిశయోక్తి కాదేమో. అంతేగా.. అంతేగా.!
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







