ఫాఫం.! జీవిత రాజశేఖర్ అలా బుక్కయిపోయారే.!

- May 20, 2022 , by Maagulf
ఫాఫం.! జీవిత రాజశేఖర్ అలా బుక్కయిపోయారే.!

సందు దొరికితే చాలు మెగా ఫ్యామిలీ మీద అవాకులు చవాకులు పేలేసే జీవితా రాజశేఖర్ అడ్డంగా దొరికిపోయారు. తాజాగా ‘శేఖర్’ సినిమా రిలీజ్ ఈవెంట్‌లో అనుకోకుండా నోరు జారి అబాసు పాలయ్యారు జీవిత. క్యాజువల్‌గా మాట్లాడుకునే మాటే అయినా, మనోభావాలు దెబ్బ తినేలా ఆమె మాట తీరు వుందంటూ ఓ వర్గం, జీవితను ఆడి పోసుకుంటున్నారు.

ఇంతకీ జీవిత నోరు జారిన ఆ మాట ఏంటో.? అనేగా మీ అనుమానం. కూతురి పిసినారితనాన్ని వుద్దేశించి.. కోమటి వాళ్లని నోట్లో నానేలా చేసింది. దాంతో ఆ వర్గం వారికి ఎక్కడ లేని కోపం చిర్రెత్తుకొచ్చింది. ఊరుకుంటారా.? నెట్టింట్లో రచ్చ మొదలెట్టేశారు.
 
చివరికి, తన టంగ్ స్లిప్సింగ్‌కి జీవిత సారీ చెప్పక తప్పలేదు. ఉత్తిగా సారీ చెబితే జీవిత ఎందుకవుతుంది.? సెలబ్రిటీల మాటల్ని వంకర బుద్ధితో మార్చేస్తూ, ముఖ్యంగా తమ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారనీ, అలాంటి వారిని గట్టిగా శిక్షించాలనీ చెప్పింది.

తనదాకా వస్తే కానీ, తలనొప్పి తెలీదు.. అంటారు. ఎదుటి వారి జీవితంలోకి అనవసరంగా తొంగి చూసి, వారి జీవితాల్ని రోడ్డున పడేసినప్పుడు తానూ సాటి సెలబ్రిటీనని సదరు జీవితగారికి గుర్తు రాలేదు కాబోలు.. అంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇదిలా వుంటే, సందట్లో సడేమియా అన్నట్లుగా చెక్ బౌన్స్ కేసు వివాదమొకటి తాజాగా జీవిత రాజశేఖర్ మెడకు ఒకింత గట్టిగానే చుట్టుకునేలా కనిపిస్తోంది.
 
కాగా, రాజశేఖర్ లీడ్ రోల్ పోషించిన ‘శేఖర్’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com