యూఏఈ: వడ్డీ కోసం వ్యక్తిగత రుణాలిస్తే కఠినమైన శిక్షలు ..!
- May 20, 2022
ప్రశ్న: నేను చాలా ఏళ్ళ నుంచి యూఏఈ లో ఉంటూ కొంచెం కొంచెంగా డబ్బును కూడబెడుతూ వస్తున్నాను. అయితే ఆ డబ్బును రుణంగా ఇచ్చి వడ్డీ పొందడం ఈ దేశంలో న్యాయ బద్ధం కదా? ఒక వేళ అదే నిజమైతే నా దగ్గర వ్యక్తిగత రుణంగా తీసుకున్న వ్యక్తి ఆ డబ్బును కట్టకపోతే నేను ఏం చేయాలి?
సమాధానం: మీ పై ప్రశ్నలకు జవాబు యూఏఈ శిక్షా స్మృతి లోని ఫెడరల్ లా నంబర్ 31 ఆఫ్ 2021 లో పొందుపరచడం జరిగినది. ఈ చట్టం ప్రకారం వడ్డీ కోసం ఒక వ్యక్తికి రుణం ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం. కేవలం యూఏఈ ప్రభుత్వ లైసెన్స్ లు కలిగిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మాత్రమే అధికారం ఉంది. లైసెన్స్ ఉన్నప్పటికీ ఈ సంస్థలు సైతం ఆ దేశ నియమ నిబంధనలను అనుసరించి ఈ వ్యాపారం చేయాలి. ఒక వేళ తెలియక ఇటువంటి వడ్డీలు ఇచ్చిన వారికి యూఏఈ శిక్షా స్మృతి లోని ఆర్టికల్స్ 458 , 459ల ప్రకారం జరిమానా విధించడం జరుగుతుంది. అసలు ఇంతకీ ఈ ఆర్టికల్స్ లో ఏముందో ముందు తెలుసుకుందాం.
ఆర్టికల్ 458 :
"ఈ ఆర్టికల్ ప్రకారం వడ్డీ కోసం ఆశపడి రుణాలు ఇవ్వడం లేదా వాణిజ్య సంబంధిత వ్యవహారాలు నెరపడం వంటి ఇతరత్రా వ్యవహారాలు రుజువైతే వారికి కనీసం ఒక సంవత్సరం తగ్గకుండా జైలు శిక్ష తో పాటుగా సుమారు Dh50,000 తగ్గకుండా జరిమానా విధించడం జరుగుతుంది".
"వడ్డీకి సంబంధించిన రుణ సంబంధిత వ్యవహారాల్లో కమిషన్ కోసం లేదా మరో విధంగానైన లబ్ధి పొందారని నిరూపితమైన వారికి . నిరూపితమైన వారు చేసిన నిజమైన న్యాయ సంబంధిత లబ్ధి లేదా సేవలు గురించి తెలియజేయాలి".
" రుణం తీసుకోవాల్సిన వచ్చిన అవసరం గురించి తెలియజేయాలి మరియు ఇందులో ఎటువంటి లబ్ధి చేకూర్చే అంశాలు లేవని ప్రకటించాలి".
" రుణం కోసం వచ్చిన వ్యక్తి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఈ ఆర్టికల్ లోని నిబంధనలు అతిక్రమించి వారిని ఆర్థికంగా దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తే ఈ చర్యను తీవ్రంగా పరిగణించబడుతుంది" .
ఆర్టికల్ 459 :
ప్రతి సాధారణ వ్యక్తి వడ్డీ కోసం ఆశపడి రుణాలు ఇచ్చినట్లు రుజువైతే వారికి 5 సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష తో పాటుగా సుమారు Dh100,000 తగ్గకుండా జరిమానా విధించడం జరుగుతుంది".
పైన పేర్కొన్న రెండు చట్ట పరమైన ఆర్టికల్స్ ప్రకారం వడ్డీ కోసం రుణాలు ఇచ్చినట్లు కచ్చితంగా రుజువైతే అతను లేదా ఆమె జైలు శిక్ష మరియు భారీగా జరిమానా విధించడం జరుగుతుంది. అదే గాని స్నేహితులు , సన్నిహితులు మరియు కొన్ని సార్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఇతరులకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చినట్లతే వారి నుండి తిరిగి తన డబ్బును తిరిగి పొందడానికి సంబంధిత అధికారిక ఒప్పంద పత్రాలు ఉండాలి. ఒకవేళ రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకపోతే అతని మీద కోర్టు లో కేసు వేసేందుకు ఈ పత్రాలు ఉపయోగపడతాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







