ఐఐటీ చదువు మరింత భారం ...
- April 07, 2016
ఐఐటీ చదువు మరింత భారం కానుంది. ప్రస్తుతం ఏడాదికి రూ. 90 వేలు మాత్రమే ఉన్న ఫీజును రూ. 2 లక్షలకు పెంచుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ ఫీజును రూ. 3 లక్షలు చేయాలని ఐఐటీ బాంబే డైరెక్టర్ దేవాంగ్ ఖాకర్ నేతృత్వంలోని సబ్ కమిటీ ప్రతిపాదించింది. అయితే ఒకేసారి దాదాపు మూడు రెట్లకు పైగా ఫీజు పెంచితే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి దీన్ని రూ. 2 లక్షలకు పెంచారు. రాబోయే విద్యాసంవత్సరం నుంచే ఈ ఫీజుల పెంపు అమలవుతుంది. మినహాయింపులు ఇలా..ఎస్సీ, ఎస్టీ, వికలాంగులతో పాటు, వార్షికాదాయం లక్ష రూపాయల లోపు ఉన్న కుటుంబాల వారికి ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నారు. వార్షికాదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న కుటుంబాల వారికి మూడింట రెండు వంతుల ఫీజును మాఫీ చేస్తారు. అంటే, వాళ్లు ఏడాదికి దాదాపు రూ. 66వేల ఫీజు కడితే సరిపోతుంది.ఒక్కో విద్యార్థికి వ్యయం రూ. 3.5 లక్షలుప్రస్తుతం ఐఐటీలలో చదువుతున్న ప్రతి విద్యార్థి మీద ఏటా సగటున రూ. 3.5లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.విద్యార్థి చెల్లిస్తున్న రూ. 90 వేల కంటే ఇది రూ. 2.6 లక్షలు అధికం. రెండు లక్షల వంతున ఫీజు పెంచినా మరో రూ. 1.5 లక్షల వంతున ప్రభుత్వం మీద భారం పడుతుంది. గత కొన్నేళ్లుగా ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ ద్వారా కంపెనీలు భారీగా వేతనాలు ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఫీజులు పెంచవచ్చంటూ కేంద్రం నియమించిన కమిటీ పచ్చజెండా ఊపింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







