యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు

- May 21, 2022 , by Maagulf
యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు

ప్రభుత్వ లైసెన్స్ లేని నియామక సంస్థల నుండి, ఒకే వర్గానికి చెందిన వారిని ప్రమోట్ చేస్తున్న నమ్మశక్యం కానీ సామాజిక మాధ్యమాల పేజీల ద్వారా గృహ కార్మికులను నియమించుకునే యూఏఈ ఉద్యోగస్తులను,కుటుంబాలను మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వశాఖ(Mohre) హెచ్చరించడం జరిగింది. 

ఈ హెచ్చరిక రావడానికి ముఖ్య కారణం ఇటీవల ఆ మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం గృహ కార్మికులను ఉత్పత్తి చేసే ప్రైవేట్ నియామక సంస్థలు ప్రభుత్వం విధించిన నిబంధనలు మరియు షరతులను పాటిస్తే నియామక లైసెన్సులు పొందవచ్చు. 

"గుర్తింపు కలిగిన నియామక సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి తాము ఎంపిక చేసిన వ్యక్తుల యొక్క హక్కులను పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి" అని మంత్రిత్వశాఖ ఆదేశాలను జారీ చేసింది. 

గృహ కార్మికులను నియమించుకున్న తర్వాత వారిని క్రమబద్ధీకరణ చేయడంతో పాటుగా వారికి ఉద్యోగ భద్రత మరియు రక్షణ కల్పించాలి.అలాగే, ప్రభుత్వం ప్రకటించిన ధరలను దృష్టిలో పెట్టుకొని తమ వారికి ఉపాధి కల్పించే కుటుంబాలకు నియామక సంస్థలు పలు రకాల రేట్లతో కూడిన ప్యాకేజీలను చూపించాలని లైసెన్స్ జారీ చేసే సంస్థలు మరియు మంత్రిత్వశాఖ పేర్కొన్నాయి.  

లైసెన్స్ లేని సంస్థల నుండి వ్యక్తులను నియమించుకోవడం ద్వారా వచ్చే 5 ఇబ్బందులు గురించి మంత్రిత్వశాఖ పేర్కొంది: 

1. దొంగతనంగా లేదా నిబంధనలకు వ్యతిరేకంగా దేశంలో ఉంటున్న వ్యక్తులను నియమించుకోవడం ద్వారా ఉపాధి కల్పించే వారు న్యాయ పరమైన సవాళ్ళను ఎదుర్కోవాలి.అలాగే, ఎటువంటి అధికారిక పత్రాలు మరియు స్పాన్సర్ షిప్ లేని ఇలాంటి వారిని నియమించుకోవడం కూడా చట్ట వ్యతిరేకం. 

2. గృహ కార్మికులని నియమించుకుంటున్న కుటుంబం ముందుగా అతని యొక్క ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. 

3. ఉపాధి పొందే వ్యక్తి యొక్క నేర చరిత్ర తెలియకపోతే ఉపాధి కల్పించిన వ్యక్తి భద్రత ప్రమాదంలో పడినట్లే.అందుకని నియామక సంస్థలు లైసెన్సులు పొందే క్రమంలో తాము ఎంపిక చేసిన అభ్యర్థులు యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించాలి. 

4. నియామక సంస్థ, ఉపాధి కల్పించే కుటుంబం మధ్య న్యాయ బద్ధమైన ఒప్పంద పత్రం లేకపోవడంతో నియామక సంస్థ ద్వారా ఉపాధి పొందిన వ్యక్తి కున్న హక్కులు మరియు  స్వతంత్రత విస్మరించబడతాయి.తాను పనిచేసే చోట ఇబ్బందులకు గురై ఫిర్యాదు చేసినప్పటికీ యజమాని మీద చర్యలు తీసుకోకపోవచ్చు. 

5. గుర్తింపు లేని సంస్థల ద్వారా నియమితులైన గృహ కార్మికులకు సరైన శిక్షణ లేకపోవచ్చు.అదే లైసెన్స్ ఉన్న సంస్థలైతే నిష్ణాతులైన శిక్షకుల ద్వారా శిక్షణ ఇప్పించడమే కాకుండా వారే ఉపాధి కల్పపిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com