సరైన దౌత్యంతోనే యుద్ధం ముగుస్తుంది : జెలెన్ స్కీ
- May 21, 2022
కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడుతున్నప్పటికీ ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది. రష్యా బలగాలకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తోంది. మరోవైపు రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమవుతున్నాయి. యుద్ధం ప్రారంభమయి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఎవరూ ఎవరిపై పైచేయి సాధించలేక పోయారు. యుద్ధం ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ… ఈ యుద్ధంలో తాము విజయం సాధిస్తామని చెప్పారు. సరైన దౌత్యంతోనే యుద్ధం ముగుస్తుందని అన్నారు. యుద్ధంలో రక్తపాతం తప్పదని అన్నారు. యుద్ధం కొనసాగుతుందని… చివరకు దౌత్య మార్గాల ద్వారానే యుద్ధం అంతమవుతుందని చెప్పారు. అయితే రెండు దేశాలు పట్టు వీడకపోవడం వల్ల.. ఇది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదని అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







