సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- May 21, 2022
న్యూ ఢిల్లీ:ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్... కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ తీరు పై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్... పలు రాజకీయ పార్టీల నేతలతోనూ సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం... ఈ నెల 22న చంఢీగడ్, ఈ నెల 26న బెంగళూరులో కేసీఆర్ పర్యటిస్తారు. మాజీ ప్రధాని దేవగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ అవుతారు. ఈ నెల 27న మహారాష్ట్ర లో కేసీఆర్ పర్యటిస్తారు. ఈ పర్యటనలో రాలేగావ్‌సిద్ధిలో అన్నాహజారేతో కేసీఆర్ భేటీ అవుతారు. ఈ నెల 29,30 తేదీల్లో బంగాల్, బిహార్‌లో కేసీఆర్ పర్యటించనున్నారు. గాల్వాల్ లోయలో మరణించిన సైనిక కుటుంబాలకు సీఎం పరామర్శించనున్నారు. మరణించిన సైనిక కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం అందజేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







