టాలీవుడ్‌లో అనిరుధ్ చక్రం తిప్పనున్నాడా.?
- May 21, 2022
ఆయన కోలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాకి మ్యూజిక్ అందించాడు. తెలుగులో అదే ఆయనకి మొదటి సినిమా. ఆయనెవరో తెలిసిపోయి వుంటుంది కదా. అవును యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిరుధ్.
తొలి సినిమాకే తెలుగులో ఫెయిల్యూర్‌ని చవి చూశాడు. దాంతో, ఆ తర్వాత మళ్లీ కొత్త ప్రాజెక్ట్ ఏమీ టేకప్ చేయలేదు అనిరుధ్. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ సినిమా కోసం అనిరుధ్‌ని సెలెక్ట్ చేసుకున్నారు.
కొరటాల శివ, ఎన్టీయార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అనిరుధ్ మ్యూజిక్ విషయంలో సర్వత్రా విమర్శలు వినిపించాయ్. కానీ, అనిరుధ్ రీసెంట్ లిస్ట్ తీసుకుంటే, ‘బీస్ట్’ సినిమా మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యింది.
భాషతో సంబంధం లేకుండా అరబిక్ కుత్తు.. సాంగ్‌కి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. అలాగే తాజాగా కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దద్దరిల్లిపోతోంది. సో, తెలుగులో అనిరుధ్‌పై వున్న నెగిటివిటీ పోయినట్టే.
సరైన హిట్టు ఒక్కటి కొట్టాడా.? అంతే, అనిరుధ్ తెలుగులో చక్రం తిప్పేయడం ఖాయం అంతే. అది ఎన్టీయార్ సినిమానే కావచ్చు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







