కంగనా ‘థాకడ్’: అనుకున్నది ఒక్కటి అయ్యింది ఇంకొక్కటి
- May 21, 2022
క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘థాకడ్’ లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజ్‌కి ముందు ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో కంగనా చేసిన రచ్చ అతా ఇంతా కాదు.
అఫ్కోర్స్ కంగనా ఎప్పుడూ అంతే అనుకోండి. తానొక ఫైర్ బ్రాండ్ అనుకుంటుంది. కాకపోవడమే. ఫైర్ బ్రాండే. బాలీవుడ్ హీరోలకు ధీటుగా తన సినిమాలే మాత్రం తీసిపోవంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటుంది వీలు చిక్కినప్పుడల్లా.
నిజమే, కంగనా మంచి నటే. కానీ, ఆటిట్యూడ్ పరంగా వివాదాలతోనే ఎక్కువగా సావాసం చేయాలనుకుంటుంది కంగనా. మగవాళ్లంటే అస్సలు గిట్టదీ ముద్దుగుమ్మకి అదేంటో.
సరే, అసలు విషయానికి వస్తే, కంగనా నటించిన ‘థాకడ్’ ఫస్ట్ డే వసూళ్లు ఘోరంగా వెలవెలబోయాయట. ఇది నిజంగా కంగనాకి చాలా అవమానం. అంతన్నాడు ఇంతన్నాడు.. గంగరాజు.. అన్నట్లుగా తెగ ఎగిరెగిరి పడింది ఈ సినిమా విషయంలో కంగనా. కానీ, ఫస్ట్ డేకే ఘోరంగా దెబ్బ తినేసింది.
మరోవైపు ఇదే రోజు రిలీజైన ‘భూల్ భూలయ్యా 2’ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్లు బాగా వచ్చాయంటూ బాలీవుడ్ మీడియా మాట్లాడుకుంటోంది. కియరా అద్వానీ, కార్తిక్ ఆర్యన్ జంటగా హారర్ కామెడీ కాన్సెప్టుతో తెరకెక్కింది ఈ సినిమా. అన్నట్లు ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేశారట. బహుశా ఇదే కంగనా డైజెస్ట్ చేసుకోలేకపోతోంది కాబోలు.
తాజా వార్తలు
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ







