బ్రిటిష్ ఎయిర్వేస్లో తెలుగు మాట్లాడే క్యాబిన్ క్రూ..
- May 22, 2022
లండన్: బ్రిటిష్ ఎయిర్వేస్ శనివారం కీలక ప్రకటన చేసింది. తమ సంస్థ హైదరాబాద్-లండన్ సర్వీస్ కోసం 20 మంది తెలుగు మాట్లాడే క్యాబిన్-క్రూ సిబ్బందిగా రిక్రూట్ చేసినట్లు తెలిపింది. ఇటీవలి కాలంలో విదేశీ విమానయాన సంస్థలు స్థానిక భాషలకు పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రిటిష్ ఎయిర్వేస్ తెలుగు మాట్లాడే క్యాబిన్ క్రూ సిబ్బంది నియమించింది. వీరికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినట్టుగా పేర్కొంది. భారతదేశంలోని స్థానిక క్యాబిన్ సిబ్బందిని ఉపయోగించి హైదరాబాద్ నుంచి లండన్‌కు తమ తొలి విమానాన్ని నడిపినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది.
కొత్తగా రిక్రూట్ చేయబడిన 20 మంది క్యాబిన్ క్రూ సిబ్బందికి లండన్ ఆరువారాల పాటు విస్తృతమైన భద్రత, సేవా శిక్షణను ఇచ్చినట్టుగా బ్రిటిష్ ఎయిర్వేస్ తెలిపింది. హైదరాబాద్-లండన్ మార్గంలో ప్రయాణించే ప్రతి విమానంలో తెలుగు మాట్లాడే సిబ్బంది ఉంటారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకనుంచి హైదరాబాద్ నుంచి లండన్‌కు రాకపోకలు సాగించే బీఏ 276, బీఏ 277 విమానాలలో ప్రయాణికులు ఇక నుంచి మాతృభాషలో పలకరింపులను ఆస్వాదించవచ్చు.
బ్రిటీష్ ఎయిర్వేస్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కాలమ్ లామింగ్ మాట్లాడుతూ..హైదరాబాద్‌కు స్థానికంగా క్యాబిన్ సిబ్బందిని నియమించుకోవడం అంటే.. ప్రయాణికులకు బ్రిటిష్ శైలి సేవలను తెలుగు భాష, సంస్కృతి, ఆచారాలతో అందించడమేనని చెప్పారు. ఇక, బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రస్తుతం ఐదు భారతీయ నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి వారానికి 28 విమాన సర్వీసులను నడుపుతోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







