గరికపాటి నర్సింహారావుకు కె.వి.రమణ జాతీయ జీవిత సాఫల్య పురస్కార ప్రదానం

- May 22, 2022 , by Maagulf
గరికపాటి నర్సింహారావుకు కె.వి.రమణ జాతీయ జీవిత సాఫల్య పురస్కార ప్రదానం

హైదరాబాద్: పద్మశ్రీ పురస్కార గ్రహీత మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు కి వేద ఉగాది పురస్కారం మరియు డాక్టర్ కె.వి రమణ జాతీయ సాఫల్య పురస్కార ప్రదానోత్సవం నిన్న 21/05/2022 న త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వైభవంగా జరిగింది.

రామకృష్ణ,సుజారమణ, కలగా రాజేశ్వరి పాటలు లలిత వ్యాఖ్యానం తర్వాత అభినయ దర్పణ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్లు ఓలేటి రంగమణి, ఓలేటి శ్రీ రేఖ శిష్య బృందం చే కూచిపూడి నృత్యాంశాలు వైష్ణవి,శ్రీనిత,అనఘ,సిరివెన్నెల,ప్రణవి అద్భుతంగా నిర్వహించారు.అనంతరం గరికపాటి వారికి సన్మానం తర్వాత వారి ప్రవచనాలు రాత్రి 9 గంటల వరకు అందరిని కట్టిపడేశాయి.

గరికపాటి దంపతులకు రాగానే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.చాలా కాలం తర్వాత త్యాగరాయ గానసభ కళకళలాడుతూ కొత్త అందాలు సంతరించుకుంది.ఈ సభలో గరికపాటి వారి సన్మానం నందివాడ అనంతలక్ష్మి వ్యాఖ్యానంతో గరికపాటివారి దంపతులను  వేదికపైకి ఆహ్వానించారు.కె.వి రమణ,మండలి బుద్ధ ప్రసాద్,ఖతార్ నుండి వచ్చిన తెలుగు కళా సమితి ప్రతినిధి పద్మజ, తోటకూర ప్రసాద్  మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేపేలా మాట్లాడటం గరికిపాటి వారి ప్రత్యేకత.. పి.వి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు మన తెలుగు వారికి పద్మ పురస్కారాలు వచ్చాయి..గరికపాటి వారికి భారత ప్రభుత్వం పురస్కారం అందించి తెలుగు జాతిని గౌరవించిందని అన్నారు.గరికపాటి వక్త, ప్రవక్త, మార్గనిర్దేశక కర్త అని కె.వి రమణ తెలంగాణ ప్రభుత్వం సలహాదారు కొనియాడారు.

వంశీ వంటి గొప్ప సంస్థ తమ స్వర్ణోత్సవాలలో భాగంగా రమణ వంటి  మహా వ్యక్తి పేర పురస్కారం గరికపాటి వారికి బహుకరించడం గొప్ప విశేషం.. ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను తొలగిస్తూ యువతను ఆకర్షించేలా మాట్లాడటం తో గరికపాటి వారు ఈ సమాజాన్ని ఎంతో ప్రక్షాళన చేస్తున్నారు.ఆయన మూడు విషయాలను మాత్రమే నమ్ముతారు..ఆయన ప్రసంగాలలో  మాతృభక్తి, మాతృభాష, మాతృదేశం పైన అభిమానం చూపుతారు..తన తల్లి ని తలచుకుని ప్రవచనం మొదలుపెడతారు అంటూ మండలి బుద్ధ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ పూర్వ ఉప సభాపతి అన్నారు.

2020లో జరగవలసిన కార్యక్రమం ఇలా కరోనా వలన పోస్ట్ పోన్ అయినదని,అంతలో ఆయనకు పద్మశ్రీ రావడం, తమ సంస్థ ద్వారా మొదటిసారి సన్మానం చేసిన ఘనత తమకు రావడం అదృష్టం అని వంశీ రామరాజు అన్నారు.తాను ఎన్నో సన్మానాలు చేశానని కానీ గరికపాటి వారికి సన్మానం అంటే భయం వేస్తుందని అన్నారు.పూలదండలు వేయకూడదు..శాలువాలు  కప్పకూడదు..కిరీటాలు పెట్టకూడదు..ఇంకా సన్మానం ఎలా..అంటూ గరికపాటి వారి నిబద్ధత, నిరాడంబరత  గురించి మాట్లాడారు..

ఇంకా ప్రముఖులు తోటకూర ప్రసాద్, పద్మజ ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో శుభోదయం గ్రూప్ అధినేత ప్రసన్న లక్ష్మి,డా.తెన్నేటి సుధా దేవి, శైలజ సుంకర పల్లి పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com