సింగపూర్ లో ఘనంగా అన్నమయ్య శతగళార్చన

- May 23, 2022 , by Maagulf
సింగపూర్ లో ఘనంగా అన్నమయ్య శతగళార్చన

సింగపూర్: తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో 5వ అన్నమయ్య శతగళార్చన మొదటి రోజు కార్యక్రమం సింగపూర్ లో సివిల్ సర్వీసెస్ క్లబ్ ఆడిటోరియం నుండి యూట్యూబ్ లైవ్ ద్వారా ఘనంగా నిర్వహించారు.మే 22, 2022 అన్నమయ్య జయంతి నాడు మొదలైన ఈ సాంస్కృతిక కార్యక్రమము,సప్తగిరి సంకీర్తనలు మరియు పిల్లలు పాడిన అన్నమయ్య కీర్తనలతో అంతర్జాలంలో ఉన్న తెలుగువారందరినీ అలరించింది.ఈ సంవత్సరం శతగళార్చనకు ఘనంగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం మొదటిరోజు మాత్రమే.ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలనుండి ఎందరో పిల్లలు పెద్దలు 108కి పైగా పంపిన కీర్తనలను, ఈ కార్యక్రమం ద్వారా  వారం రోజులపాటు ప్రతిరోజూ సాయంత్రం ఆన్లైన్ లో యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. చిన్నారులలో మన సాంస్కృతిక విలువల మీద ఆసక్తి పెంచడానికి చేస్తున్న ఈ వార్షిక కార్యక్రమానికి, కే.విద్యాధరి మరియు చిరంజీవి మౌర్యలు వ్యాఖ్యానాన్ని అందించి ప్రేక్షకులను అలరించారు.      

ఈ కార్యక్రమంలో సింగపూర్ లో ఉంటున్న గాయకులు సప్తగిరి సంకీర్తనలను ఆలాపించగా, చిన్నారి ప్రవాసభారతీయులు 70 మంది 17 పాటలను అందించారు.కాపవరపు విద్యాధరి,శేషుకుమారి యడవల్లి , షర్మిల,శ్రీదేవి నాగేళ్ల తదితర సంగీత గురువులు పిల్లలకు తర్ఫీదునిచ్చి చక్కటి అన్నమయ్య కీర్తనలను మన ముందుకు తీసుకువచ్చారు.అలాగే, ఈ కార్యక్రమంలో కవుటూరు రత్నకుమార్,అనంత్ బొమ్మకంటి,సురేష్ కుమార్ ఆకునూరి వంటి ప్రముఖులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు.ఈ అన్నమయ్య శతగళార్చన చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన Kai Media వీడియోగ్రఫీ, మరియు ఆడియో సహకారం అందించిన శివకుమార్ (వయోలిన్), శివకుమార్ గోపాలన్ (మృదంగం) లకు భాగవత ప్రచార సమితి తరపున  హృదయ పూర్వక ధన్యవాదములు.చివరగా ఈ కార్యక్రామాన్ని విజయవంతంగా నిర్వహించిన  తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులందరికి, ముఖ్యంగా నిర్వహణలో సహకరించిన భాగవత బంధువులు మరియు స్వచ్ఛంద కార్యకర్తలకు,నిర్వహణ కమిటీ సురేష్ చివుకుల, విద్యాధరి కాపవరపు, రమ్య బొమ్మకంటి, రవితేజ భాగవతుల, మరియు చి.మౌర్య ఊలపల్లి లకు కార్యక్రమ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com