యూఏఈ విద్యా విధానంలో నిర్మాణాత్మక మార్పులు
- May 23, 2022
యూఏఈ: తన విద్యా వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులను యూఏఈ ప్రకటించింది. ఇందు కోసం ఆ దేశ ఉపాధ్యక్షుడు ముగ్గురు కొత్త మంత్రులను నియమించారు. విద్యా రంగం అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి వీరికి అధికారాలు కల్పించినట్టు తెలిపారు. విద్యా శాఖ మంత్రి అహ్మద్ బెల్హౌల్ అల్ ఫలాసి.. దేశంలోని విద్యా వ్యవస్థకు సంబంధించిన అన్ని చట్టాలు, విధానాలను వారు సమీక్షిస్తారు. పబ్లిక్ ఎడ్యుకేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి, ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ చైర్పర్సన్ సారా అల్ అమీరి.. దేశంలోని ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసేందుకు ఆమె సమగ్ర ప్రణాళికను రూపొందించనున్నారు. విద్యా శాఖ సహాయ సారా ముసల్లం.. కొత్తగా ఏర్పాటు చేసిన ఫెడరల్ అథారిటీ ఫర్ ఎర్లీ ఎడ్యుకేషన్‌ను పర్యవేక్షిస్తారు. విద్యా రంగం కొత్త నిర్మాణంలో ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ కౌన్సిల్, ఫెడరల్ అథారిటీ ఫర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్, ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రతి ఎమిరేట్‌లోని స్థానిక విద్యా అధికారులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంరక్షణ కార్యక్రమాలు, కార్యకలాపాలు, ఈవెంట్లను అభివృద్ధి చేయడం, వాటి అమలును పర్యవేక్షించడం, ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించడం కోసం వారి సామర్థ్యాన్ని పెంచడానికి వినూత్నమైన కొత్త నమూనాలను వీరు ప్రతిపాదిస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







