రాష్ట్రంలో వడగాల్పుల కారణంగా 45 మంది మృతి..
- April 07, 2016
రాష్ట్రంలో వడగాల్పుల కారణంగా ఇప్పటివరకు 45 మంది మృతిచెందినట్లు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కడప జిల్లాలో అత్యధికంగా 16 మంది మృతిచెందినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వీస్తున్న వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వడగాల్పుల బారిన పడిన వారికి తక్షణం వైద్యం అందించేందుకు ఆయా ఆస్పత్రుల సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. వడదెబ్బ మృతుల కుటుంబాలను తమ ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.జిల్లాల వారీగా మృతుల సంఖ్య * కడప - 16 * ప్రకాశం - 11 * అనంతపుంర - 4 * విజయనగరం - 3 * చిత్తూరు - 3 * కర్నూలు - 3 * శ్రీకాకుళం - 2 * కృష్ణా - 2 * పశ్చిమగోదావరి -1
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







