కువైట్ విమానాశ్రయంలో సాధారణ స్థితికి చేరుకున్న విమానాల రాకపోకలు
- May 24, 2022
కువైట్: దుమ్ము తుఫాను కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు గంటల పాటు నిలిచిపోయిన విమానాల రాకపోకలు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:50 గంటలకు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. ఈ సమయంలో విమానాశ్రయానికి వచ్చే, బయలుదేరే విమానాలు రీషెడ్యూల్ చేయబడ్డాయని DGCA ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ అఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇమాద్ అల్-జులువి పేర్కొన్నారు. దుమ్ము తుఫానుతో దేశంలోని వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీని కారణంగా కొన్ని ప్రాంతాలలో దృశ్యమానత 500 మీటర్ల కంటే తక్కువకు చేరింది. దానితో పాటు గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో కూడిన చురుకైన గాలులు వీచాయి.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







