దొరికిన దావూద్ ఇబ్రహీం ఆచూకీ..కీలక విషయాలు బయటపెట్టిన దావూద్ మేనల్లుడు!

- May 24, 2022 , by Maagulf
దొరికిన దావూద్ ఇబ్రహీం ఆచూకీ..కీలక విషయాలు బయటపెట్టిన దావూద్ మేనల్లుడు!

పాకిస్తాన్​: కీలక కేసుల్లో నిందితుడు,మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ లభించింది. దావూద్​ ఇబ్రహీం పాకిస్తాన్​లోనే ఉన్నాడంటూ పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి.

వాటిని నిజం చేస్తూ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ కీలక సమాచారం రాబట్టింది. పాకిస్తాన్​లోని కరాచీలోనే దావూద్ ఉన్నట్లు.. దావూద్​ మేనల్లుడు అలీషా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు చెప్పారు. హసీనా పార్కర్ దావూద్ సోదరి కాబట్టే ఆమె గురించి ప్రపంచానికి తెలిసిందన్నారుతన కుటుంబానికి దావూద్ ఇబ్రహీంతో ఎలాంటి సంబంధం లేదని దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడైన అలీషా తేల్చి చెప్పారు. అయితే దావూద్ భార్య మెహజబిన్ పండుగల సమయంలో బంధువులతో ఫోన్ లో మాట్లాడుతుందని అలీషా ఈడీకి చెప్పారు.

వాస్తవానికి తన తల్లి హసీనా పార్కర్ గృహిణి అని, జీవనోపాధి కోసం చిన్న చిన్న ఆర్థిక లావాదేవీలు చేసేదని అలీషా ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. తనకు ఉన్న ఆస్తులను అద్దెకు ఇచ్చి ఆదాయం పొందేదని అలీషా చెప్పారు. వ్యాపారానికి అవసరమయ్యే వారికి రూ. 3 నుండి రూ. 5 లక్షలను అప్పు కోసం ఇచ్చేదన్నారు. దీనికి వడ్డీ తీసుకొనేదని అలీషా వివరించారు.త న తల్లి హసీనా కూడా రియల్ ఏస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిందని కూడా అలీషా వివరించారు. దావూద్ ఇబ్రహీం చెల్లె అయినందున తన తల్లి ఆస్తి వివాదాలను పరిష్కరించేదని అలీషా ఈడీకి వివరించారు. దావూద్ ఇబ్రహీం తాను పుట్టకముందే 1986లో దేశాన్ని విడిచి వెళ్లి పోయాడని కూడా అలీషా ఈడీకి వివరించారు.
కొన్నిసార్లు ఈద్​, ఇతర పండుగలకు దావూద్ భార్య మెహజబిన్.. నా భార్య ఆయేషా, నా సోదరినులతో మాట్లాడినట్లు తెలుసు అని అలీషా పార్కర్ చెప్పినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఓ మనీలాండరింగ్​ కేసులో విచారణకు హాజరుకావాలని అలీషా పార్కర్​కు పలుమార్లు సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ క్రమంలోనే అదుపులోకి తీసుకుని విచారించగా.. దావూద్​ కరాచీలోనే ఉన్నట్లు అతడు తెలిపాడు. అలిశా పార్కర్​ వాంగ్మూలం నమోదు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీంను పట్టుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్​ వాల్సే డిమాండ్​ చేశారు. ఇన్నాళ్లు ఆచూకీ తెలియదని, ఇప్పుడు తెలిసిన క్రమంలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com