సోనాల్ చౌహాన్ ఆ గండం గట్టెక్కుతుందా.?
- May 24, 2022
సోనాల్ చౌహాన్.. సెల్ఫీ పాప అంటూ బాలయ్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చిందేసింది. ఆన్ స్క్రీన్ అందాల ఆరబోతలో పాపక పాపే పోటీ అని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
తాజాగా ‘ఎఫ్ 3’ మూవీలో నటిస్తోంది ఈ అమ్మడు. ఏం పాత్ర అని మాత్రం అడక్కండి.. ఎందుకంటే అదో చిదంబర రహస్యం మరి. ఆమె పాత్రను అంతలా హైడ్ చేసి వుంచారు. సినిమా రిలీజైతే కానీ సోనాల్ పాత్ర ఏంటనేది తెలియదట.
‘ఎఫ్ 3’ ట్రైలర్‌లో మాత్రం పక్కా గ్లామర్ బొమ్మగా అలా చూపించీ చూపించనట్లుగా చూపించి తీసేశారు సోనాల్ చౌహాన్‌ని. సరే, అంతా బాగానే వుంది. సోనాల్ చౌహాన్ తెలుగు సినిమాకి కొత్తేమీ కాదండోయ్.
గతంలో బాలయ్యతోనే బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో నటించేసిందీ ముద్దుగుమ్మ. అయితే, అవి కూడా స్పెషల్ రోల్సే. ‘పండగ చేస్కో’ సినిమాలో యంగ్ హీరో రామ్ పోతినేని సరసన సెకండ్ హీరోయిన్‌గా నటించింది కూడా.
అయితే అవన్నీ ఒకెత్తు. ‘ఎఫ్ 3’ ఇంకో ఎత్తు సోనాల్ చౌహాన్‌కి. నిజానికి ఈ సినిమాలో లీడ్ హీరోయిన్స్‌గా తమన్నా, మెహ్రీన్ వున్నారు. కానీ, ఎందుకో తెలీదు సోనాల్ చౌహాన్ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది.
ప్రమోషన్లలోనూ అంతే. సోనాల్ డ్రస్సింగ్ స్టైల్, ఆటిట్యూడ్, క్యూట్ లుక్స్ అందరి అటెన్షన్‌ని క్యాచ్ చేసేలా వుంటున్నాయ్. ఇదంతా చూస్తుంటే, సోనాల్‌కి ‘ఎఫ్ 3’ తర్వాత సోలో హీరోయిన్ ఛాన్సులు కుప్పలు తెప్పలుగా రావడం ఖాయమనిపిస్తోంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







