యూకేలోని కీలక విభాగాల్లో 10 బిలియన్ పౌండ్లు వెచ్చించనున్న ఖతార్

- May 25, 2022 , by Maagulf
యూకేలోని కీలక విభాగాల్లో 10 బిలియన్ పౌండ్లు వెచ్చించనున్న ఖతార్

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా వ్యూహాత్మక పెట్టుబడుల భాగస్వామ్యంపై సంతకాలు జరిగాయి. యూకేలో కీలక విభాగాల్లో 10 బిలియన్ పౌండ్లను ఖతార్ పెట్టుబడి పెట్టనుంది. రానున్న ఐదేళ్ళలో యూకే ఎకానమీ, మరీ ముఖ్యంగా ఫిన్‌టెక్, జీరో ఎమిషన్స్ వెహికిల్స్, లైఫ్ సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో ఈ పెట్టుబడులు పెడతారు. 2022 ఖతార్ వరల్డ్ కప్ గురించి కూడా ఇరువురు అధినేతలూ చర్చించారు. మిలిటరీ, కౌంటర్ టెర్రరిజం సపోర్ట్ వంటి విభాగాల్లో ఖతార్‌కి యూకే సాయం అందిస్తుందని బోరిస్ జాన్సన్ చెప్పారు. యూకే ఖతార్ టైపూన్ స్క్వాడ్రన్, ఎయిర్ సెక్యూరిటీని మరింత పదిలం చేస్తుందని ఇరువురూ చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com