దుబాయ్ ఎయిర్ పోర్ట్ ప్రయాణికులకు ఉచిత బస్సు సేవలు
- May 26, 2022
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DXB) ఉత్తర రన్‌వే మూసివేసి రెండు వారాలకు పైగా అవుతోంది. అనేక విమానాలను దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (DWC)కి మళ్లించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాల నిర్వాహకులు ప్రయాణికులందరికీ సేవలందించేందుకు రెండు విమానాశ్రయాల మధ్య మల్టీ రవాణా సర్వీసు సదుపాయలను ప్రకటించారు. మే 9 నుండి జూన్ 22 వరకు 45 రోజుల మూసివేత వ్యవధిలో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ లు ప్రయాణీకులందరూ తమ విమానం బయలుదేరే విమానాశ్రయం సమాచారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. దుబాయ్ విమానాశ్రయాలు DXB, DWC అన్ని టెర్మినల్స్ మధ్య ప్రతి 30 నిమిషాలకు ఉచిత బస్సు సేవను అందిస్తోంది. ఉబెర్ కార్ సర్వీస్‌ల ద్వారా ప్రయాణించే వారు యాప్ ద్వారా కారును బుక్ చేసుకునేటప్పుడు ‘DWC2022’ కోట్ చేస్తే తగ్గింపులను పొందవచ్చని ఎయిర్ పోర్ట్ నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







