అఖిల్ ‘ఏజెంట్’ మామూలుగా వుండదు

- May 26, 2022 , by Maagulf
అఖిల్ ‘ఏజెంట్’ మామూలుగా వుండదు

అక్కినేని హీరో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాతో హిట్టు కొట్టి వున్నాడు. తదుపరి ‘ఏజెంట్’ సినిమాలో నటిస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. కాగా, సురేందర్ రెడ్డి మేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

హీరోని స్టైలిష్‌గా ప్రజెంట్ చేయడంలో సురేందర్ రెడ్డి సిద్ధ హస్తుడు. అలాంటిది అఖిల్ లాంటి కటౌట్‌ని ఆయన ఇంకెంతలా యూజ్ చేసుకోబోతున్నాడో కదా. ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో సిద్ధమయ్యాడు. కండలు తిరిగిన దేహం, కాన్ఫిడెన్స్ లుక్స్.. ఇలా ‘ఏజెంట్’ కోసం చాలా ప్రత్యేకమైన మేకోవర్ చూపిస్తున్నాడు అఖిల్.

హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఈ సినిమా కోసం డిజైన్ చేస్తున్నారట. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ‘భోర్నఐడెంటిటీ’ మూలం. ఇంటర్ పోల్ ఏజెంట్‌గా అఖిల్ పాత్ర చాలా చాలా పవర్ ఫుల్‌గా వుండబోతోంది ఈ సినిమాలో.

బాలీవుడ్ భామ సాక్షి వైద్య ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. కాగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథను అందించారు.

అఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాపై ఇటు అఖిల్, అటు నాగార్జున ఇద్దరూ చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే, ఇక హీరోగా అఖిల్ కెరీర్‌కి ఏ మాత్రం ఢోకా వుండదనేది నాగార్జున అభిప్రాయం. ఈ రేంజ్ భారీ అంచనాలున్న ‘ఏజెంట్’ ఆగస్టు 12న ధియేటర్లలో సందడి చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com