ఫిఫా 2022కు సిద్ధమైన ఖతార్ విమానాశ్రయాలు
- May 28, 2022
దోహా: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఫిఫా వరల్డ్ కప్ కోసం దేశంలోని రెండు విమానాశ్రయాలు దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు సిద్ధమయ్యాయి. వివిధ దేశాల నుంచి ప్రేక్షకులు, ఫుట్బాల్ అభిమానులు వచ్చేఅవకాశం ఉన్నందునా ఎయిర్ పోర్టులు గరిష్ట సామర్థ్యంతో పనిచేయనున్నాయి. ప్రతిరోజూ 16,000 మంది ప్రయాణికులు వచ్చివెళ్లేందుకు తగిన ఏర్పాట్లను చేసినట్లు ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ అల్ బేకర్ తెలిపారు. దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 - 6,000 మంది ఫుట్బాల్ అభిమానులను ప్రాసెస్ చేస్తుందని, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రతి రోజు 8,000 - 10,000 మంది ప్రయాణికులు వచ్చి వెళ్లేలా పనిచేస్తాయని తెలిపారు. నిన్న ఖతార్ ఎయిర్వేస్, నాలుగు గల్ఫ్ ఎయిర్లైన్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. దీనిలో భాగంగా ఫ్లైదుబాయ్ రోజుకు 2,700 మంది అభిమానులను, కువైట్ ఎయిర్వేస్ 1,700 మందిని, ఒమన్ ఎయిర్ 3,400 అభిమానులను, సౌదియా(Saudia) 10,000 మంది అభిమానులను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







