పబ్లిక్ యుటిలిటీల ధ్వంసం.. SR100,000 జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష

- May 28, 2022 , by Maagulf
పబ్లిక్ యుటిలిటీల ధ్వంసం.. SR100,000 జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష

రియాద్: పబ్లిక్ యుటిలిటీస్ ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయని, వాటిని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసే వ్యక్తులకు భారీ జరిమానాలు విధిస్తామని సౌదీ అరేబియా ప్రాసిక్యూషన్ అధికారులు హెచ్చరించారు. ఏదైనా పబ్లిక్ యుటిలిటీ వ్యవస్థలకు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిన పక్షంలో నేరస్తుడితోపాటు అతనికి సహకరించిన వారికి కూడా శిక్షలు విధించబడుతుందన్నారు. నేర తీవ్రతను బట్టి గరిష్టంగా SR100,000 జరిమానా, రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొంది. అలాగే పబ్లిక్ యుటిలిటీకి జరిగిన నష్టం లేదా ఇతరులకు జరిగిన అన్ని నష్టాలను తిరిగి చెల్లించడంతో పాటు,నిబంధనలు ఉల్లంఘించినవారి వల్ల కలిగే నష్టాన్ని సరిదిద్దడానికి అయ్యే ఖర్చులను పరిహారం కింది నిందితులు చెల్లించాల్సి ఉంటుందని ప్రాసిక్యూషన్ అధికారులు స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com