ఆన్‌లైన్ వీసా విధానాల్లో ఎలాంటి మార్పు లేదు:సౌదీ
- May 29, 2022
రియాద్: యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫారమ్ కింద విదేశీ కార్మికుల నియామక ప్రక్రియ, ప్రవాసుల వీసా ప్రక్రియకు సంబంధించి ప్రస్తుత ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు, విధానాలలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ మేరకు మే 17న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫారమ్ హోస్టింగ్ ఏడాదిలోగా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్‌ఐసి)కి బదిలీ చేయబడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOFA) ఆధ్వర్యంలోని ఆన్‌లైన్ వీసా ప్లాట్‌ఫారమ్‌ను ఎన్‌ఐసిగా మార్చాలని క్యాబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయడానికి క్యాబినెట్ మొత్తం 11 మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలను నియమించింది. ఏకీకృత ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయడానికి, విధివిధానాలను ఖరారు బాధ్యతను వీటికి అప్పగించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్‌లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







