కాఫీ షాప్ యజమానులకు BD40,000 చెల్లించాలి: హైకోర్టు
- May 29, 2022
బహ్రెయిన్: అద్దెలు చెల్లించకపోవడం, ఒప్పంద నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ కేఫ్ యజమానులు దాఖలు చేసిన కేసులో హైకోర్టు తీర్పును వెల్లడించింది. కాఫీ హౌస్ లీజుదారులకు 3% వార్షిక వడ్డీతో కలిపి BD40,000 చెల్లించాలని హైకోర్టు కాఫీ షాప్ యజమానులను ఆదేశించింది. కేఫ్‌ను అద్దెకు తీసుకున్న ఇద్దరు భాగస్వాములపై కేఫ్ యజమానులు దాఖలు చేసిన కేసులో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020లో సంతకం చేసిన ఒప్పందం, బహిర్గతం చేయని మొత్తానికి బదులుగా కాఫీ షాప్‌ను నడపడానికి భాగస్వాములను అనుమతించిందని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. లీజుదారులు కూడా మూడు నెలల అద్దెను ముందుగానే చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం.. వ్యాపార నిర్వహణకు సంబంధించిన ఇతర ఖర్చులతో పాటు దుకాణం నెలవారీ అద్దె, ఉద్యోగుల జీతాలు, వారి వసతికి అయ్యే మొత్తాన్ని ఇద్దరూ చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







