ఫిఫా వరల్డ్ కప్ 2022.. గేట్‌వే పర్మిట్‌గా హయ్యా కార్డ్
- May 29, 2022
దోహా: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022 సందర్భంగా అంతర్జాతీయ, స్థానిక అభిమానుల కోసం హయ్యా(hayya) కార్డ్ డిజిటలైజ్ చేయబడిందని, ఇది గేట్‌వే పర్మిట్‌గా ఉపయోగపడుతుందని సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ (SC) అధికారులు తెలిపారు. డిజిటల్ హయ్యా కార్డ్ అభిమానులను దేశం, స్టేడియంలలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అలాగే మెట్రో, బస్సు, టాక్సీలతో సహా ప్రజా రవాణా సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని హయ్యా కార్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సయీద్ అల్ కువారి తెలిపారు. వరల్డ్ కప్ టిక్కెట్లను కొనుగోలు చేసిన తర్వాత అభిమానులు హయ్యా కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అల్ కువారి సూచించారు. ఫిఫాటోర్నమెంట్ సమయంలో జీసీసీ జాతీయులతో సహా ప్రపంచం నలుమూలల నుండి అభిమానులు హయ్యా కార్డ్ లేకుండా ఖతార్లోకి ప్రవేశించడానికి అనుమతించబడరని స్పష్టం చేశారు. హయ్యా మ్యాచ్ డే పాస్ ను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు అల్ కువారి తెలిపారు. ఇది నిర్దేశించిన తేదీ నుండి 48 గంటల వరకు చెల్లుబాటు అయ్యే ఎంట్రీ పర్మిట్ అవుతుందన్నారు. ప్రపంచ కప్ 2022 సందర్భంగా అభిమానుల కోసం విల్లాలు, అపార్ట్మెంట్లు, హాలిడే హోమ్‌లు, ఫ్యాన్ విలేజ్‌లు, ఫ్లోటింగ్ హోటళ్లతో సహా సందర్శకుల కోసం వెబ్సైట్లో అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయని వసతి వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒమర్ అల్ జాబర్ చెప్పారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







